చిత్రం : శుక్ర

నటీనటులు : అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్, మిలాన్ రాఠీ, సంజీవ్ రాయ్ తదితరులు

నిర్మాత : నల్ల అయ్యన్న నాయుడు

సంగీతం : ఆశీర్వాద్సి

ఛాయాగ్రహణం : జగదీష్ బొమ్మిశెట్టి

రిలీజ్ డేట్ : 2021-04-23

కథ :

శుక్ర కథ ఏమిటంటే అరవింద్ కృష్ణ యువ వ్యాపారవేత్త. అతని భార్య శ్రీజితా ఘోష్. బిజినెస్ వ్యవహారాల్లో చికాకుల కారణంగా భార్యను సంతృప్తి పరచలేని పరిస్థితి ఏర్పడుతుంది. క్రమంలో భార్యను మెప్పించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో భార్య పుట్టిన రోజున పార్టీ ఏర్పాటు చేసి ఫ్రెండ్స్ను ఆహ్వానిస్తారు. పార్టీలో అనుకోకుండా జరిగిన గందరగోళంలో కొన్ని హత్యలు జరుగుతాయి. మ్యారీడ్ కపుల్స్ చేసుకొనే పార్టీలోకి బ్యాచలర్గా రాజ్ మిలాన్ రాఠీ ఎందుకు ప్రవేశించాడు..? బర్త్ డే పార్టీలో కాల్పులు ఎందుకు చోటుచేసుకొన్నాయి. హత్యలకు 2 వేల కోట్ల విలువైన వజ్రాల స్మగ్లింగ్కు సంబంధమేమిటి..? పార్టీలో రాజ్ ఎందుకు హత్యకు గురయ్యాడు..? కాల్పుల్లో చనిపోయిందనుకొన్న రియా ఎలా బతికి వచ్చింది..? ఇంతకు 2 వేల కోట్ల విలువైన వజ్రాల కథ ఏమిటి? అసలీ కథలోశుక్రఎవరు అనే ప్రశ్నలకు సమాధానమే శుక్ర సినిమా కథ. హత్యలు ఎలా జరిగాయి..!? వాటి వెనుక ఎవరున్నారు..? దేనికోసం హత్యలు జరిగాయి..? వీటి నుండి అరవింద్ కృష్ణ  ఎలా బయటపడ్డాడు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాలి. ఇప్పుడు రివ్యూలో సినిమా విశ్లేషణ చూద్దాం

కథనం :

దర్శకుడు సుకు పూర్వజ్ ఎంచుకొన్న పాయింట్ కొత్తగానే ఉంది. కానీ కథను నడిపించే విధానంలోనే భారీగా తప్పడగులు పడ్డాయి. కథలో అనవసరమైన ట్విస్టులు జొప్పించే ప్రయత్నం, తొలి భాగంలో అనవసరమైన సాగదీత సినిమా కథా గమనాన్ని దెబ్బ తీశాయి. తొలి భాగంలో ఎక్కువగా నసపెట్టినట్టు అనిపిస్తుంది. తొలి భాగమే సినిమాకు కాస్త అడ్డంకిగా మారిందనే ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే  సెకండాఫ్ను డీల్ చేసిన విధానం ఆకట్టుకొన్నది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కథను నడిపించిన విధానం మరింత ఆకట్టుకొన్నది. తన స్వేచ్ఛ, సౌలభ్యం కోసం కథలో జొప్పించిన ట్విస్టులను జొప్పించిన తీరు వాస్తవానికి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కథను నేరుగా కొన్ని ట్విస్టులతో తెరకెక్కించి ఉంటే తప్పకుండా న్యూ ఏజ్ థ్రిల్లర్గా మారి ఉండేదేమో. ఓవరాల్గా సుకు తొలి ప్రయత్నం ఓకేలా ఉంది.

నటీనటుల పెర్ఫార్మెన్స్ :

నటీనటుల యాక్టింగ్ నటీనటులు ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. అరవింద్ కృష్ణ విల్లీ పాత్రలో ఒదిగిపోయారని చెప్పవచ్చు. కానీ కొన్ని సీన్లలో స్థాయికి మించిన యాక్టింగ్ ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. రియాగా శ్రీజితా ఘోష్ అందాల ఆరబోతకే పరిమితమైంది. పెద్దగా నటించడానికి స్కోప్ లేకపోయింది. జార్జ్గా సంజీవ్ రాయ్, ఇతర నటీనటులు వారి పాత్రలకు అనుగుణంగా నటించారు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. క్వాలిటీ, రిచ్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. థ్రిల్లర్ సినిమా కావాల్సిన మూడ్ ఎలివేట్ చేయడానికి వాడుకొన్న లైటింగ్ బాగుంది. జగదీష్ బొమ్మిశెట్టి కెమెరా పనితనం బాగుంది. కొన్ని సీన్లలో పెట్టిన యాంగిల్స్లో అత్యుత్సాహం కనిపిస్తుంది. ఇక సినిమాకు ఆశీర్వాద్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్. సెకండాఫ్లో వచ్చే ఐటెమ్ సాంగ్ బాగుంది. రీరికార్డింగ్ విషయానికి వస్తే కొన్ని సీన్లను బాగా ఎలివేట్ చేసిందనిపిస్తుంది. ఎడిటర్కు ఇంకా చేతినిండా పని ఉందనిపిస్తుంది. నల్ల అయ్యన్న నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల ఎంపికపై మరింత దృష్టి పెట్టి ఉంటే సినిమా కథ వేరేలా ఉండేదనిపించింది.

చివరిగా : ‘శుక్రఎవరో తెలియాలి అంటే పార్ట్ – 2 కోసం వేచి చూడాలి.

రేటింగ్ : 1.5/5

గమనిక : ఈ రివ్యూ క్రిటిక్ అభిప్రాయం మాత్రమే

Leave a comment

error: Content is protected !!