singham Again : సింగం సినిమా సిరీస్ లో మూడవ భాగం సింగం ఎగైన్ (సింగం-3) షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్ మరోసారి పవర్ ఫుల్ పోలీసాఫీసర్ సింగం గా నటిస్తున్నారు. దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా, విలన్ గా అర్జున్ కపూర్ కనిపించనున్నారు. ఇక ఇందులో టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు అజయ్ కూడా ఈ చిత్రంలో ఒక పోలీస్ పాత్రలో నటిస్తున్నారు.

సింగం-3 షూటింగ్ సెట్స్ లో అజయ్ దేవ్ గణ్ తో అజయ్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉండగా, షూటింగ్ పెండింగ్ ఉండటంతో దీపావళి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. సింగం సినిమా సిరీస్ 2011లో మొదలైంది. మొదటి రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించాయి. ఈ చిత్రాల ద్వారా రోహిత్ శెట్టి-అజయ్ దేవ్‌గణ్ కాంబో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్-నటుడిగా గుర్తింపు పొందింది. సింగం-3 కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!