Teja Sajja : సూపర్ హిట్ చిత్రం ‘హను-మాన్‌’ తర్వాత మరో పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు యువ హీరో తేజ సజ్జా. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘మిరాయ్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని చిత్రబృందం తెలిపింది. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ చిత్రం 8 భాషల్లో ఏప్రిల్ 18న విడుదల కానుంది.

ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని కలిగించేలా 2డీ, 3డీ ఫార్మాట్‌లలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. తేజ సజ్జా పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్‌లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘హను-మాన్‌’ తర్వాత ‘మిరాయ్‌’ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ సినిమా తేజా సజ్జా.. కెరీర్ ను ఏ రేంజ్ లో మలుపు తిప్పుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!