Teenage Love story : ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటించిన “ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143” సినిమా జూన్ 21న విడుదల కానుంది. డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం రూపొందించిన ఈ చిత్రం ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కింది. ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల తదితరులు ఈ సినిమాలో నటించారు.

ఇంటర్మీడియట్ లో చదువుకునే ఇద్దరు విద్యార్థుల మధ్య చిగురించే ప్రేమ కథగా ఈ సినిమా రూపొందించబడింది. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మించిన ఈ చిత్రానికి యూ.ఏ సర్టిఫికేట్ లభించింది. తాజాగా ఈ చిత్ర గ్రాండ్ రిలీజ్ ప్రెస్ మీట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని సినిమా గురించి వివరంగా మాట్లాడారు.

Leave a comment

error: Content is protected !!