హీరో కావాలని వచ్చి డైరెక్టర్ అయినవారు.. డైరెక్టర్ యాంబిషన్‌తో వచ్చి హీరోగా మారిన వారు ఫిల్మ్ ఇండస్ట్రీ లో చాలామందే వున్నారు. అలా తామొకటి అనుకుంటే ఇండస్ట్రీలో మరొకటి జరుగుతుంది. వెన్నెల సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్విస్తున్న కమెడియన్ వెన్నెల కిశోర్. ఈ పాపులర్ కమెడియన్ సినీ ఎంట్రీ విచిత్రంగా జరిగింది.
దేవ కట్టా డైరెక్షన్‌లో వచ్చిన వెన్నెల మూవీ ఆడిషన్స్ స్టేట్స్‌లో జరిగింది. అక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కిశోర్.. రైటర్‌గా ఛాన్స్ దొరుకుతుందేమోనని దేవ కట్టాను కలిసాడట. కిశోర్ చెప్పిన స్టోరీస్‌లో రెండు సీన్స్ నచ్చి దేవకట్టా తన అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఛాన్సిచ్చాడు. ఈ వెన్నెల సినిమాలో కమెడియన్‌గా చేయాల్సిన శివారెడ్డికి వీసా ప్రాబ్లమ్ వచ్చి ఫారెన్ వెళ్లలేకపోయాడు. అయితే ఆడిషన్స్ టైమ్‌లో వచ్చిన న్యూ ఆర్టిస్ట్స్‌కి కిశోర్ ఇచ్చే సలహాలు, యాక్ట్ చేసి చూపే పద్దతి నచ్చి ఆ క్యారెక్టర్‌ని కిశోర్ చేతే చేయించాడు దేవ కట్టా. అలా అసిస్టెంట్ డైరెక్టర్ కిశోర్ కాస్తా వెన్నెల కిశోర్‌గా పాపులర్ అయి నవ్విస్తూనే ఉన్నాడు. అనుకున్నదొకటి అయ్యింది మరొకటి. అయినా సరే తెలుగు సినిమాకు మాత్రం మంచి కమెడియన్ దొరికాడు.