టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోల్లో యన్టీఆర్ ది తిరుగులేని క్రేజ్. నటనలోనూ, నాట్యంలోనూ , డైలాగ్స్ చెప్పడంలోనూ తనకుంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న అతగాడు.. ప్రస్తుతం రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’లో రామ్ చరణ్ తో కలిసి తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించనున్నాడు. నేడు తారక్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్   ట్రీట్ ఏదైనా ఇస్తాడని అభిమానులు ఎదురు చూశారు. కానీ అలాంటిదేమీ ఉండదని .. ఆ సినిమా యూనిట్ ఇటీవలే ప్రకటించింది. దాంతో కాస్తంత నిరాశకు గురయ్యారు అభిమానులు.

ఇదిలా ఉంటే..  ఇటీవల  తారక్  ఫిట్‌నెస్‌ శిక్షకుడు లాయిడ్‌ స్టీవెన్స్‌ అభిమానుల కోసం ఓ సర్‌ప్రైజ్‌ ఇస్తానని చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కానుకను సామాజిక మాధ్యమాల వేదికగా అందించాడు స్టీవెన్స్‌. ఆరుపలకల దేహంతో ఉన్న తారక్‌ ఫొటోను విడుదల చేశాడు. అయితే ఇది గతంలో ఫొటో. ఇప్పటి వరకు బయటకు రాలేదు. తారక్‌ బర్త్‌డే సందర్భంగా ‘అన్‌సీన్‌ పిక్‌’ పేరిట ఈ ట్రీట్‌ ఇచ్చాడాయన. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో టెంపర్, అరవింద సమేత వీరరాఘవ చిత్రాలకోసం ఆరుపలకల దేహాన్ని ప్రదర్శించిన తారక్.. మళ్లీ ఈ విధంగా అతడి సిక్స్ ప్యాక్ ఫోటో అభిమానులకు మరోసారి ఆనందాన్ని కలిగిస్తోంది.

Leave a comment

error: Content is protected !!