పరభాషలో హిట్ అయిన సబ్జెక్ట్స్‌ తెలుగులో డబ్‌ కావడం ఎప్పటినుంచో ఉన్న ట్రెండే. కాకపోతే.. కన్నడలో హిట్ అయిన ఓ సినిమాను ఐదేళ్ల తర్వాత డబ్‌ చేస్తున్నారు. అదే తారకాసుర. కన్నడలో 2018 లో రిలీజయి సూపర్‌ హిట్ అయిన మూవీ తారకాసుర. ఈసినిమాను అదే పేరుతో శ్రీజా మూవీ బ్యానర్‌ తెలుగులో రిలీజ్‌ చేస్తోంది. విజయ్‌ భాస్కర్‌ రెడ్డి ఇపాళ్యం ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. రవికిరణ్‌ హీరోగా రూపొందిన ఈ సినిమాలో మెయిన్‌ హీరోయిన్ మాన్విత హరీష్ కాగా.. సెకండ్ లీడ్ తృప్తి శుక్లా చేసింది. చంద్రశేఖర్ బండియప్ప దర్శకత్వం వహించారు. తెలుగు వెర్షన్ రిలీజ్‌ సందర్భంగా హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌సెంటర్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించింది చిత్ర యూనిట్‌.
ఈ సందర్భంగా తెలుగు సినీ ప్రముఖులు హాజరై చిత్ర విజయాన్ని కాంక్షించారు. హాజరయిన వారిలో నిర్మాత విజయ్ భాస్కర్ రెడ్డి, విలన్ పాత్రధారి శాంసన్ యోహాన్, సెకండ్ హీరోయిన్ తృప్తి శుక్లా, సెకండ్ హీరో పద్మశ్రీ ఫేమ్ చక్రవర్తి పాల్గొనగా… ప్రముఖ దర్శకులు నగేష్ నారదాసి, ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్, పద్మిని నాగులపల్లి ఉన్నారు. కన్నడలో సంచలనం సృష్టించిన ఈ సినిమా తెలుగులోనూ బంపర్ హిట్ కాబోతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసారు.
తెలుగు వెర్షన్‌ రిలీజ్‌ లో కొన్ని మార్పులు చేసినట్టుగా నిర్మాత విజయ్‌ భాస్కర్‌ రెడ్డి చెప్పారు. కథలో చేసిన మార్పులకు అనుగుణంగా షూటింగ్ కూడా చేయబోతున్నట్టు తెలిపారు. త్వరలో తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయడానికి సిద్దంగా ఉన్నట్టు చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కుమార్ గౌడ, సంగీతం: ధర్మ విషి, పి.ఆర్.వొ: ధీరజ్-అప్పాజీ!!

Leave a comment

error: Content is protected !!