భారతీయ తాంత్రిక శాస్త్రానికి, పురాణ ఇతిహాసాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా.. తంత్ర శాస్త్రంలో ఎన్నో రహస్యాలున్నాయి. ఇవి తెలుసుకోవడం అంత ఈజీ కాదు. తంత్రంలోని రహస్యాలతో ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌తో తంత్ర అనే మూవీ రూపొందుతోంది. వకీల్‌సాబ్, మల్లేశం ఫేమ్ అనన్య నాగళ్ల ఇందులో మెయిన్‌లీడ్‌ చేస్తోంది.ఈ చిత్రాన్ని శ్రీనివాస్‌ గోపిశెట్టి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ.. ఫస్ట్‌ కాపీ మూవీస్‌, బి ద వే ఫిల్మ్స్‌, వి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
దివంగత విలక్షణ నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్‌ ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మర్యాదరామన్న ఫేమ్‌ సలోని ఈ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ చిత్రం పోస్టర్‌ను గ్రాండ్‌గా లాంచ్‌ చేసారు. క్షుద్రశక్తులు అనన్యని పీడిస్తున్నట్టుగా ఉండే పోస్టర్‌ ను రిలీజ్‌ చేసారు. ఈ పోస్టర్‌ను చూడగానే సినిమాపై ఆసక్తి కలిగేలా డిజైన్ చేసారు. అన్ని కార్యక్రమాలు శరవేగంగా పూర్తిచేసుకుని రిలీజ్‌ డేట్ అనౌన్స్‌ చేస్తామని మేకర్స్‌ తెలిపారు.

Leave a comment

error: Content is protected !!