అనన్య నాగళ్లమల్లేశం సినిమాతో ఎంట్రీ ఇచ్చి వకీల్‌సాబ్‌తో పాపులర్‌ అయిన అనన్య నాగళ్ల .. తన పరిధిలో సినిమాలు చేస్తూ.. మెయిన్‌ ట్రాక్‌లోకొచ్చే స్థాయికి చేరింది. ప్రస్తుతం అనన్య చేస్తున్న మూవీ తంత్ర. ఈ సినిమా ప్రమోషన్‌ స్ట్రాటజీ ఆసక్తి రేకెత్తిస్తుంది. పిల్ల బచ్చాలూ ఈ సినిమాకు రాకండి అంటున్నారు. అదేంటి ? అంటే.. తంత్ర సినిమా సెన్సార్‌ కంప్లీట్ అయ్యింది. A సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. ఆ విషయాన్ని ప్రకటిస్తూ.. పిల్లలు ఈ సినిమా చూడకూడదనే సెన్సార్‌ ఆదేశానుసారం ప్రమోట్‌ చేస్తున్న విధానం ఆకట్టుకుంటోంది.

ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి శ్రీనివాస్‌ గోపిశెట్టి డైరెక్ట్ చేసారు. అనన్య నాగళ్లతో పాటు దినేష్‌ రఘుముద్రి జత కట్టారు. సలోని ఇతర కీలక పాత్ర పోషించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను త్వరలో విడుదల చేయనున్నట్టు తెలిపారు మేకర్స్.

Leave a comment

error: Content is protected !!