మిల్కీబ్యూటీ తమన్నా భాటియా.. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ అనే సినిమాలో తెలంగాణా మహిళా కబడ్డీ జట్టుకు కోచ్ గా నటిస్తోంది. కరోనా లాక్ డౌన్ సందర్భంగా ఇంటికే పరిమితమైన అమ్మడు … ఈ సమయాన్ని పెర్ఫెక్ట్ గా విని యోగించుకుంటోంది. ఇటీవలే పిల్లో ఛాలెంజ్‌తోనూ సామాజిక మాధ్యమాల్లో తమన్నాసందడి చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడొక మెట్టు పైకెక్కి తల్లకిందులుగా విన్యాసాలు చేసేస్తోంది.
‘ఆర్ట్ ఆఫ్ ఫాలింగ్’ పేరుతో తాను హెడ్‌స్టాండ్ (తల నేల మీద కాళ్లు పైకి ఉంచడం) ఎలా చేసిందో అభిమానులతో పంచుకుంది. తన ట్రైనర్ ఆధ్వర్యంలో తమన్నా ఇలా చేసింది. ‘ సరైన పొజిషన్ వచ్చేందుకు ఎన్నో సార్లు ప్రయత్నించా. శిక్షకులు (ట్రైనర్లు) లేకుండా ప్రాక్టీస్ చేయొద్ద’ని సూచించారు తమన్నా. ఈ ఆసనానికి నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తన శరీరాన్ని ఎలా కావాలంటే.. అలా మౌల్డ్ చేసే టాలెంట్ కలిగిన అమ్మడికి ఈ విన్యాసం ఒక లెక్కా అంటూ. . ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు అభిమానులు.