కెరీర్ పరంగా విజయాలతో ఏ స్థాయికి చేరుకున్నా కూడా తాము చేసిన తొలి చిత్రం, తొలి విజయాన్ని ఎవరూ అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోరు. ప్రస్తుతం తమన్నాఇటువంటి అనుభూతికి లోనైంది. ‘హ్యాపీడేస్’ సినిమా దర్శకుడు శేఖర్ కమ్ములను ఇటీవల అనుకోకుండా కలిసిన తమన్నా తన మనసులోని హ్యాపీ నెస్ ను ఏ మాత్రం దాచుకోకుండా వ్యక్తం చేసింది. శేఖర్ కమ్ముల కలవడంతో తన ‘హ్యాపీడేస్’ ను గుర్తు చేసుకున్నట్లు తనతో దిగిన ఫోటోలను సామాజిక మాధ్యమంలో పంచుకుంది. ఆ సినిమా తమన్నా కెరీర్ లో ‘హ్యాపీడేస్’ ఓ స్పెషల్ మూవీ. 2005లో మంచు మనోజ్ ‘శ్రీ’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఆ తర్వాత కూడా కొన్ని తమిళ్ సినిమాలు చేసిన ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. అప్పుడే శేఖర్ కమ్ముల ఆమెను ‘హ్యాపీడేస్’ మూవీలో ‘మధు’ పాత్రకు ఎంపిక చేసుకున్నాడు. లంగా వోనిలో తెలుగింటి అమ్మాయిలా ఆ క్యారెక్టర్ తో చక్కగా ఒదిగిపోయింది తమన్నా. అప్పటి వరకూ ఉత్తరాది భామగా ఉన్న ఇమేజ్ తొలగిపోయింది. మన తెలుగమ్మాయే అనిపించేలా ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత వరుస సినిమాల విజయాలతో టాలీవుడ్ మిల్కీ బ్యూటీ గా నిలిచింది.