తమన్నా భాటియా.. మిల్కీబ్యూటీగా అభిమానులు పిల్చుకునే టాలెంటెడ్ స్టార్ హీరోయిన్. ఈ మధ్య కాలంలో ఎవరికీ దక్కని అదృష్టం తమన్నాకు దక్కింది. టాలీవుడ్ కోలీవుడ్‌లో సీనియర్ టాప్ స్టార్స్‌తో నటించే అవకాశం దక్కించుకుంది. జైలర్‌తో సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో, భోళాశంకర్‌తో మెగాస్టార్ చిరంజీవి సరసన ఒకేసారి యాక్ట్ చేసే అవకాశం తమన్నా సొంతమైంది. జైలర్ ఆగస్ట్ 10న రిలీజ్ అవుతుంటే.. భోళాశంకర్ ఆగస్ట్ 11 న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో ముచ్చటించింది మిల్కీబ్యూటీ.
మెగాస్టార్ చిరుతో డాన్స్ చేయడం చాలా గ్రేట్ ఫీలింగ్ నిచ్చిందనీ… రజినీకాంత్‌తో జైలర్‌లో చేసిన డాన్స్‌కు విపరీతమైన రీచ్ వచ్చిందనీ.. ఇద్దరు బిగ్గస్ట్ ఇండస్ట్రీ స్టార్స్‌తో కలిసి ఒకే టైమ్ లో రిలీజ్ అవుతున్న సినిమాలలో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది తమన్నా భాటియా.
వేదాళం రీమేక్ అయినా.. భోళాశంకర్‌లో చాలా మార్పులు చేసారని… ఇందుతో తన పాత్రకు హ్యూమర్ ఫ్లేవర్ యాడ్ చేసారని చెప్పారు. అలాగే మిల్కీబ్యూటీ పాట చాలా క్యూట్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చిందన్నారు. ఇందులో హుక్ స్టెప్‌తో పాటు గ్రేస్పుల్ మూమెంట్స్ చాలా ఉన్నాయన్నారు. ఇప్పుడు చాలామంది చేస్తున్న స్టెప్స్ చిరు డాన్స్ నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్తోనేనని చెప్పారు. ఇక జైలర్‌లో చేసిన పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇందులో కొద్దిసేపే కనిపించినా రజినీకాంత్‌తో యాక్ట్ చేయడం చాలా గొప్ప అనుభూతి అన్నారు. భోళాశంకర్‌లో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసినట్టు చెప్పారు.
ఆగస్ట్ 10 న జైలర్, ఆగస్ట్ 11 న భోళా శంకర్ రిలీజ్ తో అక్కడా ఇక్కడా నేనే అన్నట్టు తమన్నా ముఖంలో కళ వెలిగిపోతుంది.