ఎక్కడో మహారాష్ట్రలో పుట్టిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, ఇక్కడే మన తెలంగాణలో పుట్టి పెరిగిన యంగ్ టాలెంటెడ్ విజయ్ వర్మ ప్రేమలో పడతారని ఎవరైనా అనుకున్నారా? అలా అందరినీ ఆలోచనలో పడేయడమే ప్రేమ లక్షణం కాబట్టి అందుకు ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఈ ఇద్దరూ ఎంతో కాలం నుంచి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. త్వరలో పెళ్లి చేసుకోనున్నారంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి. ఈ ఏడాది జూన్‌లో విడుదలైన ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ కోసం తొలిసారి విజయ్‌ – తమన్నా కలిసి వర్క్‌ చేశారు. ఆ సెట్‌లోనే వీరిద్దరి మధ్య స్నేహం కుదరింది. అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డారు. అలా విజయ్ వర్మ .. మన తెలంగాణ అబ్బాయినే కాబట్టి.. మిల్కీ బ్యూటీ తెలంగాణ వారి ఇంటి కోడలు కాబోతోందన్నమాట.

Leave a comment

error: Content is protected !!