కరోనా వైరస్ భయంతో ప్రపంచమంతా ఒణికిపోతున్న సంగతి తెలిసిందే. దాంతో ఇండియా మొత్తం కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నియమాలకు కట్టుబడి లాక్ డౌన్ ను ఫాలో అవుతోంది. ఇక కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య ఇండియాలో కూడా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నివారణ కోసం బడా వ్యాపార వేత్తలు సినీ ప్రముఖులు పెద్ద మనసుతో విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు.
ఇక కరోనా వల్ల కష్టాలు పడుతున్న సినీ కార్మికులను ఆదుకోడానికి మెగాస్టార్ చిరంజీవి సారధ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ ‘మనకోసం’ను ప్రారంభించారు. ఇప్పటికే ఈ సంస్థకు సినిమా ఇండస్ట్రీ నుంచి చిన్న పెద్ద అని తేడా లేకుండా పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చి భారీ విరాళాలు అందించారు. కానీ ఒకరిద్దరు హీరోయిన్స్ తప్ప స్టార్ హీరోయిన్స్ ఎవరూ ఇంతవరకు కరోనా క్రైసిస్ ఫండ్ కు విరాళం ఇవ్వడానికి ముందుకు రాలేదని చెప్పొచ్చు. నిన్నటికి నిన్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముందుకొచ్చి తన మంచి మనసు చాటుకుంది. తాజాగా ఈ లిస్ట్ లోకి ఇప్పుడు అందాల తమన్నా కూడా చేరింది. కథానాయికల్లో ఇప్పటివరకూ కాజల్ అగర్వాల్ సిసిసికి రూ. 2లక్షలు విరాళం అందించింది. తాజాగా తమన్నా సిసిసికి రూ. 3లక్షల విరాళం అందించింది.
Milky Beauty @tamannaahspeaks donated Rs 3 lakhs to #CoronaCrisisCharity today for the welfare of TFI daily wage workers @KChiruTweets#LetsFightCoronaTogether#IndiaFightsCoronavirus#StayHomeStaySafe pic.twitter.com/OL4Mn3Pvjy
— BARaju (@baraju_SuperHit) April 18, 2020