టాలీవుడ్ హాండ్సమ్ హీరో శ్రీకాంత్ సినీ కెరీర్ ను మలుపుతిప్పిన చిత్రం ‘తాజ్ మహల్’. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ముప్పలేని శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 25, 1995 లో విడుదలై అఖండ విజయం సాధించింది. నేటికి సరిగ్గా పాతికేళ్ళను పూర్తి చేసుకున్న ఈ  సినిమా ద్వారా మోనికా బేడీ కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అయింది. అలాగే.. గీత రచయిత చంద్రబోస్ సినీ ప్రయాణం కూడా ఈ సినిమాతోనే మొదలైంది. యం.యం. శ్రీలేఖ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలన్నీ అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. అలాగే జంధ్యాల డైలాగ్స్ సినిమాకే హైలైట్స్  గా నిలిచిపోతాయి.  ప్రేమకు కులమతాలు అడ్డుగోడగా నిలిచినా..  ప్రేమికుల్ని అవేవీ వేరు చేయలేవనే సందేశంతో ‘తాజ్ మహల్’ చిత్రం రూపొందింది.

హీరోగా శ్రీకాంత్ కు తొలి బ్లాక్ బస్టర్ అందించిన ఈ సినిమాగా తాజ్ మహల్ ప్రత్యేకతను సంతరించుకుంది. సంఘవి సెకండ్ హీరోయిన్ గా నటించగా.. శ్రీహరి, రంగనాథ్, కోట శ్రీనివాసరావు, నూతన్ ప్రసాద్, సుధ, బ్రహ్మానందం, బాబూమోహన్, సుధాకర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. పాతికేళ్ళు దాటినా.. తాజ్ మహల్ చిత్రం నేటి జెనరేషన్ ఆడియన్స్ ను కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Leave a comment

error: Content is protected !!