Shopping Cart 0 items - $0.00 0

Tag: Mrunal Thakur

సీతారామం ఇండియ‌న్ సినిమాలో బేక్ త్రూ అవుతుంది – మృణాల్ ఠాకూర్‌

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సీతారామం’.  హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు సంగీత ప్రియులని మెస్మరైజ్ చేసి చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఆగస్ట్5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో క‌థానాయిక మృణాల్‌ ఠాకూర్ శ‌నివారంనాడు విలేఖరుల సమావేశంలో ముచ్చటించారు. ఆమె పంచుకున్న ‘సీతారామం’ చిత్ర విశేషాలివి. మీ  కెరీర్ సీరియ‌ల్‌ తో మొద‌లైంది. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ చేయ‌డం ఎలా అనిపిస్తుంది? నా మొద‌టి సీరియ‌ల్ బాలీవుడ్‌లో `కుంకుమభాగ్య‌.` అది అన్ని భాష‌ల్లో డ‌బ్ అయింది నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇలా తెలుగులో వైజ‌యంతి మూవీస్ బేన‌ర్‌ లో హీరోయిన్‌ గా చేస్తాన‌ని అనుకోలేదు. అందులోనూ దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా, అశ్వ‌నీద‌త్ నిర్మాత‌గా చేస్తున్న సినిమా నాకు ఇదో గొప్ప అచీవ్ మెంట్‌. సీత పాత్ర‌కు ద‌ర్శ‌కుడు మిమ్మ‌ల్ని ఎలా ఎంపిక‌ చేశారు? హిందీ జ‌ర్సీ రీమేక్ షూటింగ్ జ‌రుగుతుండ‌గా నేను చంఢీగ‌ర్‌ లో వున్నాను. హ‌నుగారు ఫోన్ చేసి ఒక‌సారి క‌ల‌వాల‌న్నారు. అలా ముంబైలో కాఫీషాప్‌ లో క‌లిశాం. ఆ త‌ర్వాత పూర్తి క‌థ‌ను ఆఫీసులో విన్నా. ఆయ‌న నెరేష‌న్ చేసే విధానం నా ఎగ్జైట్‌మెంట్ చూసి వెంట‌నే ఫిక్స్ చేశారు. మ‌హాన‌టి సినిమా చూశార‌ట‌ కదా? నా మొద‌టి సినిమా ల‌వ్ సోనియా. ఫిలింఫెస్టివ‌ల్ మెల్‌బోర్న్‌లో జ‌రుగుతుండ‌గా అక్క‌డ నాగ్ అశ్విన్ గారు క‌లిశారు. అక్క‌డ మ‌హాన‌టి సినిమా గురించి నాగ్ వ‌చ్చారు. అందులో కీర్తిసురేష్ అద్భుతంగా న‌టించింది. అలా నాగ్ గారు ప‌రిచ‌యం  వైజ‌యంతి ఫిలింస్‌లో నేను భాగ‌మ‌య్యాను.  ఆ త‌ర్వాత సినిమాలు చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం? ల‌వ్ సోనియా హిట్ త‌ర్వాత కొంత‌కాలం గ్యాప్ వ‌చ్చింది. మా అమ్మ‌గారు ఏదైనా సీరియ‌ల్ చేయ‌వ‌చ్చుగ‌దా అన్నారు. నాకు మంచి అవ‌కాశం వ‌స్తుంద‌నే న‌మ్మ‌కంతో వున్నాను. అలా న‌మ్మ‌కం నిజ‌మైంది. నా ల‌వ్ సోనీయా సినిమా అన్ని భాష‌ల్లోనూ వ‌చ్చింది. సీత పాత్ర ఎలా అనిపించింది? సీతా రామంలో సీత పాత్ర చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ప్ర‌తి న‌టికి సీత పాత్ర చేయాల‌నే డ్రీమ్ వుంటుంది. నేను ధైర్యంగా చెబుతున్నా. ఇది నా పుట్టిన‌రోజు గిఫ్ట్‌గా భావిస్తున్నాను.  రొమాంటిక్ సినిమాలో చేయ‌డం ఎలా వుంది? సీతారామం ఇండియ‌న్ సినిమాలో బేక్ త్రూ అవుతుంది. నాకు క‌థ‌క్ అంటే ఇష్టం. ఇందులో కొరియోగ్రాఫ‌ర్ బృంద‌గారు చాలా ఎక్సెప్రెష‌న్స్ చూపించారు. ఇది రొమాంటిక్ ప్రాజెక్ట్‌. సీతారామంలో నా పాత్ర‌లో ఐదు షేడ్స్ వుంటాయి. కెరీర్‌ లో అరుదుగా వ‌చ్చే పాత్ర ఇది. దుల్క‌ర్ స‌ల్మాన్‌ తో న‌టించ‌డం చాలా ఆనందంగా వుంది. సీత పాత్ర‌ ఎంత రొమాంటిక్ గా వుంటుంది? ట్రైల‌ర్‌లోనే మీకు క‌నిపిస్తుంది. సినిమాలో చూస్తే మీకు బాగా అవ‌గాహ‌న అవుతుంది. ర‌ష్మిక‌తో న‌టించ‌డం ఎలా అనిపిస్తుంది. మీ ఇద్ద‌రి కాంబినేష‌న్ సీన్స్ వున్నాయా? ర‌ష్మిక‌లో ఎన‌ర్జీ లెవ‌ల్ ఎక్కువ‌. త‌ను ఒక‌రోజు ముంబై, మ‌రో రోజు చెన్నై, ఫారిన్ ఇలా చలాకీగా తిరుగుతుంది. సెట్లో చాలా హుషారుగా వుంటుంది. అంద‌రినీ చాలా కేర్ తీసుకుంటుంది. త‌ను కేర్ ఫుల్ గా వుంటుంది. మా కాంబినేష‌న్ సీన్స్ సినిమాలో చూడాల్సిందే.…

error: Content is protected !!