తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో సింగిల్ స్ర్కీన్ థియేటర్స్ పదిరోజుల పాటు మూసివేస్తున్నారని వస్తున్న వార్తలపై తెలుగు చలన చిత్ర మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ స్పందిస్తూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. గుంటూరు రీజియన్‌తో పాటు ఆంధ్రా ప్రాంతంలోని కొన్ని ఇతర ప్రాంతాల్లోని సినిమా యజమానులు గత కొన్ని నెలలుగా తగిన ఆదాయాన్ని ఆర్జించలేకపోతున్నారు. అందుకే డిజిటల్ ప్రొవైడర్ల కు చార్జీలు చెల్లించలేకపోతున్నారు. ఆ కారణంగానే తాము థియేటర్లను మూసివేసినట్లు మాకు తెలిసింది. తెలంగాణలో ప్రేక్షకుల కొరతతో కొన్ని సినిమాల యాజమాన్యాలు కూడా స్క్రీన్‌లను మూసేయాల్సి వచ్చింది. ఇది ప్రధానంగా ఎన్నికలు , IPL కారణంగా ఆదాయంపై ప్రభావం చూపింది.

ఈ సందర్భంగా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి సంబంధం లేకుండా, ఒక సంఘం సినిమా థియేటర్లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాము అని తెలియజేస్తున్నాము. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా మరియు ప్రింట్ మీడియాలో సినిమా థియేటర్ల మూసివేతకు సంబంధించి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా నుండి ఏ గ్రూప్ గాని సినిమా థియేటర్ యజమానులు లేదా మరే ఇతర అసోసియేషన్ నుండి గాని అపెక్స్ బాడీలకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని మేము పునరుద్ఘాటిస్తున్నాము. అందుకే థియేటర్ల బంద్ ఫేక్ అని తెలియజేస్తున్నాం. ఇది తక్కువ వసూళ్లు రావడంతో థియేటర్లను మూసివేసిన కొందరు థియేటర్ యజమానులు వారి వ్యక్తిగత నిర్ణయం. అంటూ ప్రసన్నకుమార్ లేఖలో తెలియజేశారు.

Leave a comment

error: Content is protected !!