Suriya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాల విషయంలో దూకుడు గా ఉన్నారు. దసరాకి “కంగువ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆయన, ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో మరో సినిమాతో అలరించనున్నారు. దీనికి ఇంకా పేరు నిర్ణయించలేదు. అయితే, ఇప్పుడు సూర్య మరో కొత్త ప్రాజెక్ట్ లో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది.

“మఫ్టీ” సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన కన్నడ దర్శకుడు నర్తన్, తన తదుపరి చిత్రాన్ని సూర్యతో కలిసి చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ యశ్ హీరోగా నటిస్తున్న “టాక్సిక్” అనే పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తోంది. మరి నర్తన్ సూర్యతో ఎలాంటి కథను తెరకెక్కిస్తాడో చూడాలి.

Leave a comment

error: Content is protected !!