Swayambhu : భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించే ‘స్వయంభూ’ చిత్రంలో నిఖిల్ కథానాయకుడిగా నటిస్తున్నారు. సంయుక్తా మేనన్, నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భువన్, శ్రీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరణ జరుగుతోంది. నిఖిల్ పాత్ర చాలా కీలకమైనది. ఒక యోధుడిలా కనిపిస్తాడు. ఈ పాత్ర కోసం నిఖిల్ ప్రత్యేక శిక్షణ కూడా పొందాడు.

నిఖిల్ కెరీర్‌లో 20వ చిత్రం ‘స్వయంభూ’ ఒక మైలురాయి,” అని మేకర్స్ అంటున్నారు. ప్రస్తుతం అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుగుతోంది. ఎంతో గాఢతతో కూడిన ఈ సినిమా ప్రేక్షకులకు ఓ గొప్ప అనుభూతిని పంచుతుందని చెప్పవచ్చు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం, కె.కె.సెంథిల్‌ కుమార్ ఛాయాగ్రహణం, ఎం. ప్రభాకరన్ ప్రొడక్షన్ డిజైన్ అందిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో ఈ చిత్రం విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!