టైటిల్: సువర్ణ సుందరి
నటి నటులు: జయప్రద, పూర్ణ, సాయి కుమార్, సాక్షి చౌదరి, కోట శ్రీనివాస్ రావ్ తదితరులు…
సంగీతం: సాయి కార్తిక్
ఎడిటర్: ప్రవీణ్ పుడి
సినిమాటోగ్రఫీ: ఈశ్వర్ ఏల్లు మహానతి
నిర్మాత: ఏం.యల్.లక్ష్మి
దర్శకత్వం: ఏం.ఎస్.యెన్ సూర్య
స్టార్ హీరోయిన్ జయప్రద, సాయి కుమార్, పూర్ణ వంటి నటీనటులతో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం “సువర్ణ సుందరి”. ఏం.ఎస్.యెన్ సూర్య దర్శకత్వం లో ఏం యల్ లక్ష్మి ఈ సినిమాని నిర్మించారు. ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఫిల్మ్ ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో అంచనాలు తారా స్థాయికి పెంచిన సువర్ణ సుందరి సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుందో ఓ సారి చూద్దాం.
కథ: సువర్ణ సుందరి అంటే ఒక త్రినేత్రి అమ్మవారి విగ్రహం. ఈ విగ్రహం ఉన్న చోట చుట్టూ పక్కల అంతా వినాశనమే జరుగుతుంది.
ఈ విగ్రహం గురించి బాగా తెలిసిన పాపులర్ ఆర్కియాలిజిస్ట్ విశాలాక్షి(జయ ప్రద) ఆ విగ్రహాన్ని ఎలా నాశనం చేసింది. అసలు ఆ విగ్రహంలో దుష్ట శక్తి ఎలా ప్రవేశించింది అనేది కథ? ఈ కథ లో అంజలి (పూర్ణ) అండ్ సాక్షి (సాక్షి చౌదరి)కి ఆ విగ్రహంతో ఉన్న సంబంధం ఏంటి? ఈ విషయాలన్నీ తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.
కధనం, విశ్లేషణ:సువర్ణ సుందరి టైటిల్ ప్రేక్షకుల్లో బాగా నానింది. ట్రైలర్ చూసిన తరువాత కథ ఎంతో అద్భుతంగా ఉంటుందని తప్పకుండ ఎక్సపెక్ట్ చేస్తారు. త్రినేత్రి అమ్మవారి రూపంలో ఉన్న పవర్ ఫుల్ దుష్ట శక్తీ, రక్త దాహం తీర్చుకోవడానికి రాజ్యాలను సైతం అంత మొందిస్తుంది. అంతే కాదు, ఆ విగ్రహం ఉన్న చుట్టూ పక్కల మనుషులు మెల్ల మెల్లగా అంతమవ్వుతారు. తెర మీద ఇలాంటి సీన్స్ చూసేటప్పుడు పాయింట్ బాగున్నా, సీన్స్ చాలా సాగదీత గా ఉంటాయి. ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఆ విగ్రహం కొన్ని సన్నివేశాలలో ప్రేక్షకులని భయపెట్టిన అక్కడక్కడ వచ్చే గ్రాఫిక్ వర్క్స్ మైనస్ అవ్వడంతో ఇంపాక్ట్ ఉండదు.
సెకాండాఫ్‌లో అసలు బ్యాగ్రౌండ్ కథ రివీల్ అవుతుంది. అసలు సువర్ణ సుందరి నేపథ్యం ఏంటి? సువర్ణ సుందరిని ఎలా అంత మొందించాలి? ఈ సినిమా మేకింగ్‌లో ఫెయిల్యూర్ అని సగటు ప్రేక్షకుడు ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా పాయింట్ బాగున్నా ఇంకాస్త రక్తి కట్టించే యాక్షన్ సీన్స్ అండ్ విజ్యువల్స్ మీద శ్రద్ద పెట్టి ఉంటె అరుంధతి రేంజ్ లో హిట్ అయ్యుండేది. అదే విధంగా సినిమా లో అక్కడక్కడ వచ్చే పాటలు ఈ సినిమాకి మరో మైనస్.
నటి నటులు పెర్ఫామెన్స్: హీరోయిన్ పూర్ణ అంజలి ద్వి పాత్రలో ఎంతో నైపుణ్యాన్ని కనబరిచింది. ఒక పక్క క్లాసికల్ గా, మోడ్రన్ గా నిండుగా హుందాగా కనిపిస్తుంది. ఆర్కియాలిజిస్ట్ విశాలాక్షి ముఖ్య పాత్రలో జయప్రద అనుభవంతో కూడిన యాక్టింగ్ తో అదరకొట్టింది. సాయి కుమార్ పాత్ర నిడివి తక్కువే అయ్యిన ఉన్నంత సేపు ఆకట్టుకుంటాడు. సాక్షి చౌదరి తన హైట్, ఫిజిక్ అండ్ ఫైట్స్ తో ప్రేక్షకులని డ్రగ్ లాగా ఎక్కిస్తుంది. కోట శ్రీనివాసరావు, అవినాష్, నాగినీడు తమ పాత్రలు తమ పరిధి మేరకు బాగానే నటించారు.
సాంకేతిక విభాగం: ఏం.ఎస్.యెన్ సూర్య దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా గ్రాఫికల్ ఫెయిల్యూర్ అయ్యిన పాయింట్ అదిరిపోయింది. స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ మీద కొద్దిగా శ్రద్ద వహించి ఉంటే నెస్ట్ లెవెల్ ఉండేది. ఎడిటింగ్ ప్రవీణ్ పుడి పని తీరు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ ఈశ్వర్ ఏల్లు మహానతి విజ్యువల్స్ పరంగా బాగానే ఇచ్చిన, కొన్ని చోట్ల తేలిపోయాయి. మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ తన పరిధి మేరకు బాగానే బిజీఏం అందించారు అందించారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ యావరేజ్ గా ఉన్నాయి.
రేటింగ్: 3/5
బాటమ్ లైన్: ఆకట్టుకున్న “సువర్ణ సుందరి”
రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్