యంగ్ ఏజ్ లో ఉండగానే ప్రొడ్యూసర్స్ గా తమను తాము ప్రూవ్ చేసుకొనే కెపాసిటీ మెగా ఫ్యామీలో చాలా  పుష్కలంగా ఉంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అల్లు అరవింద్. చాలా చిన్నవయసులోనే గీతా ఆర్ట్స్ స్థాపించి.. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు అరవింద్. అలాగే మెగా బ్రదర్ నాగబాబు కూడా సరిగ్గా అంతే ఏజ్ లో అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి .. చిరంజీవితో పలు చిత్రాలు నిర్మించారు. ఇక  రామ్ చరణ్ కూడా తన తల్లి కోరిక మేరకు చాలా తక్కువ వయసులో కొణిదెల ప్రొడక్షన్స్ హౌస్ స్థాపించి తన తండ్రితో ‘ఖైదీ నంబర్ 150, సైరా’ చిత్రాలు నిర్మించి ..  సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నాడు. ఇప్పుడు అదే స్ఫూర్తితో మెగా డాటర్ సుస్మిత కూడా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టనుండడం హాట్ టాపిక్ గా మారింది.

చిరు-చరణ్ అండదండలతోనే గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ అనే బ్యానర్ ని ప్రారంభించి ఇందులో  ఓ వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు సుస్మిత. నిజానికి సుస్మితకు ప్రొడక్షన్ వ్యవహారాలేవీ కొత్తేమీ కాదు. ఖైదీనంబర్ 150 – సైరా నరసింహారెడ్డి చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తూనే ప్రొడక్షన్ వ్యవహారాల్ని చక్కబెట్టారు. నిర్మాత రామ్ చరణ్ కి చేదోడువాదోడుగా నిలిచి తాను కూడా బోలెడంత అనుభవం ఘడించారు. ఇప్పుడు అదే అనుభవంతో వెబ్ సిరీస్ ని నిర్మించి తదుపరి పలు చిత్రాల్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇకపై మెగా యువహీరోలతో సినిమాలు నిర్మించేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారని సమాచారం. వెబ్ సిరీస్ లకు మునుముందు ఉన్న ఆదరణ దృష్ట్యా సొంతంగా ఓటీటీ- డిజిటల్ వ్యాపారంలోకి మెగా ఫ్యామిలీ దిగనుందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సుస్మిత అందులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అభిమానులు అంచనా వేస్తున్నారు. మేనమామ అల్లు అరవింద్ `ఆహా` తో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో అడుగుపెట్టడం .. అందులో సక్సెస్ అవడం.. సుస్మిత కు కొండంత బలాన్నిచ్చిందట. అదే స్ఫూర్తితో అమ్మడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనుండడం విశేషంగా మారింది.

 

 

 

Leave a comment

error: Content is protected !!