బాలీవుడ్  యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్  మృతిని అభిమానులు ఇప్పటికీ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ కుర్రోడు ఇలా బలవంతపు చావును కోరుకుంటాడని ఎవరూ ఊహించలేకపోయారు. ఇక అతడి కుటుంబ సభ్యుల పరిస్థితి చెప్పనే అక్కర్లేదు. సుశాంత్ సింగ్ వ్యక్తిత్వాన్ని , మంచితనాన్ని, అతడి ఇష్టాల్ని ,అలవాట్లని కుటుంబ సభ్యులతో అతడికున్న రిలేషన్స్ ను గుర్తుకు తెచ్చుకుని బాధపడుతున్నారు .  అతడు లేడు అనే నిజాన్ని .. క్రమేపి మరచిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా .. అతడి పేరున ఫౌండేషన్ స్థాపించబోతున్నారు.  ఈ విషయంపై సుశాంత్ కుటుంబ సభ్యులు ట్విట్టర్ లో అఫీషియల్ స్టేట్ మెంట్ ఇచ్చారు.

సినిమా, సైన్స్ అండ్ స్పోర్ట్స్ లో విశేషమైన ప్రతిభ చూపించిన కుర్రోళ్ళకి సహాయం చేసే విధంగా.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫౌండేషన్స్ స్థాపించనున్నారు. ఇక  పాట్నాలోని రాజీవ్ నగర్ లో సుశాంత్ ఉన్న ఇంటిని మెమోరియల్ హౌస్ గా మార్చబోతున్నామని తెలియచేశారు. అందులో టెలీస్కోప్, వేలకొద్దీ పుస్తకాలు, ఫ్లైట్ సిమ్యులేటర్ లాంటి సుశాంత్ వాడిన వస్తువుల్ని అభిమానుల కోసం అందులో ఉంచనున్నారట. అంతేకాదు అతడి ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ , ట్విట్టర్ అకౌంట్స్ .. ఇకపై లెగసీ అకౌంట్స్ గా మారబోతున్నాయని.. మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని వారు లేఖలో వివరించారు.

 

Leave a comment

error: Content is protected !!