బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని బాంద్రాలో తననివాసంలో సుశాంత్ సింగ్ ఉరిపోసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. దానికి కారణం ఏంటన్నది ఇంకా తెలియలేదు. సుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్ పరిశ్రమను ఒక్కసారి గా కుదిపేసింది. ఆయన అభిమానులు షాక్ లో ఉన్నారు.
2008 లో స్టార్ ప్లస్ లో ప్రసారమైన ఒక సీరియల్ తో సుశాంత్ సింగ్ బుల్లితెరకు పరిచయం అయ్యారు. ఆ సీరియల్ మంచి విజయం సాధించడంతో సుశాంత్ పేరు మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత కైపో చెయ్, శుద్ధదేశీ రొమాన్ప్, యం.యస్.ధోని, కేదార్ నాథ్, చిచ్చోరే లాంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. కొన్ని రోజుల క్రితమే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశా సలిన్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొన్ని రోజులకే సుశాంత్ కూడా ఆత్మహత్య చేసుకోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ తిన్నది.