నేను హీరోగా చేసినా ఇంత హై రాదు.. మెగాస్టార్‌ చిరుతో స్క్రీన్‌ షేర్ చేసుకోవడం జీవితంలో గొప్ప అనుభూతి.. లైఫ్‌లో గుర్తుండిపోయే సినిమా ఇది.. అంటూ సుశాంత్‌ చాలా ఎగ్జయిట్‌ అయ్యాడు. భోళాశంకర్‌లో చిరుతో కలసి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు సుశాంత్‌. మెహర్‌ రమేష్‌ డైరెక్షన్‌లో రామబ్రహ్మం సుంకర భారీ బడ్జెట్‌ తో నిర్మించారు. ఆగస్ట్ 11 న రిలీజ్‌ కాబోతున్న సందర్భంగా ప్రమోషన్స్‌ జోరు పెంచారు. ఇందులో భాగంగా సుశాంత్‌ పాత్రికేయులతో సినిమా విశేషాలు పంచుకున్నారు.
మెగాస్టార్‌ చిరుతో నటిస్తున్నానని చిన్న మావయ్య నాగార్జునతో చాలా ఎగ్జయిటింగ్‌ గా చెప్పాననీ, ముఖ్యంగా చిరుతో కలిసి ఓ సాంగ్‌లో డాన్స్‌ కూడా చేసానని చెప్పినపుడు చాలా హ్యాపీగా ఫీలయ్యారని చెప్పారు. అదే ఎగ్జయిట్‌ మెంట్‌ సినిమా మొత్తం కంటిన్యూ అయ్యిందన్నారు.


అలవైకుంఠపురంలో మూవీ కోసం ఓ అవార్డ్‌ చిరు చేతుల మీదుగా అందుకున్నాను, రావణాసుర ఓపెనింగ్ చిరు చేతుల మీదుగా జరిగిందనీ.. చిరుతో కలిసి నటించే ఛాన్స్‌ కలలో కూడా ఊహించలేదన్నారు. అది సాకారం చేసింది మెహర్‌ రమేష్ అని చెప్పారు. చిరు సెట్‌ లో ఎలా ఉంటారనేది చెప్తూ… చిరు చాలా జోవియల్‌ గా అందరితో జోక్స్‌ వేస్తూ.. యాక్టర్స్‌లో టెన్షన్‌ లేకుండా చేస్తారన్నారు. ఓ సీన్‌లో చిరు ట్యాక్సీ డ్రైవర్ అయితే తాను ప్యాసింజర్‌ అనీ.. చిరు డోర్‌ తీస్తుంటే ఏదోలా అనిపించి తానే డోర్‌ తీస్తుంటే.. స్క్రిప్ట్ ప్రకారం ఎలా ఉందో అలా చేయమంటూ చిరునే తీసారట. చిరంజీవి డెడికేషన్ అలా ఉంటుందన్నారు. తాతగారితో నటించిన టైమ్‌లో విశేషాలు, స్టెప్స్‌ గురించి చెప్పేవారన్నారు.
తన మొదటి సినిమాలో హీరోయిన్‌ తమన్నా.. ఈ సినిమాలో సుశాంత్, తమన్నా బ్రదర్‌ సిస్టర్‌ రోల్‌లో చేసామన్నారు. కీర్తి సురేష్‌తో చాలా మంచి సీన్స్‌ ఉన్నాయి. ఈ సినిమా అయ్యేలోగా మంచి ఫ్రెండ్సయ్యామని చెప్పారు.
ఒరిజినల్ వెర్షన్‌ వేదాళం కు ఈ సినిమాకు తన పాత్ర విషయంలో చాలా మార్పులు చేసారన్నారు సుశాంత్‌. తన అప్పీయరెన్స్‌ , స్క్రీన్‌ ప్రజెన్స్‌ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నానన్నారు. భోళా మేనియాలో తన పాత్ర చిన్న బ్రీజ్‌లా ఉంటుందన్నారు. ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కాబోతుంది.

Leave a comment

error: Content is protected !!