ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ ఒణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం.. జన స్వీయ నిర్బంధంలో భాగంగా లాక్ డౌన్ ప్రకటించింది. ఈ టైమ్ లో దేశ వ్యాప్తంగా సినిమా షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమనే నమ్మకొన్న కొంత మంది కార్మికులకు ఉపాథి లేకుండా పోయింది. అందుకే ‘సినీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియా’ (FEFSI) కి తమిళ హీరో సూర్య , అతడి తమ్ముడు కార్తి, వారి తండ్రి శివకుమార్ కలిిసి రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు.