‘సూర్యాపేట్ జంక్షన్‘.. ఈ క్యాచీ టైటిల్‌తో తెలుగు మూవీ రాబోతుంది. యూత్‌కి నచ్చే అంశాలతో అనిల్ కుమార్ కాట్రగడ్డ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘కొత్తగా ప్రయాణం‘ ఫేమ్ ఈశ్వర్ ఈ సినిమాలో హీరో. ఈ సినిమాకి ఈశ్వర్ కథ సమకూర్చడం విశేషం. కన్నడ , మళయాళ చిత్రాలతో పాపులర్ అయిన నైనా సర్వర్ ఈ మూవీలో ఫీమేల్ లీడ్ చేస్తోంది. రాజేష్ నాదెండ్ల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈమూవీ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం రీసెంట్‌గా హైదరాబాద్‌లో జరిగింది. సూర్యాపేట్ పరిసర ప్రాంతాల్లో జరిగే ఈ సినిమాలో కంటెంట్ తెలుగు ఆడియెన్స్‌కి విపరీతంగా నచ్చుతుందంటున్నారు. ఉచిత పథకాల వల్ల ప్రజలు ఎంత నష్టపోతున్నారో తెలిపే కథాంశం ఇది అంటున్నారు మేకర్స్.
ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ నేచురల్‌గా ఉంటాయని, 4 పాటలు యూత్‌ని ఆకట్టుకుంటాయన్నారు హీరో, కథ రచయిత ఈశ్వర్ తెలిపారు. గబ్బర్ సింగ్ ఫేమ్ అభిమన్యు సింగ్ ఈ మూవీలో మరో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇంకా చమ్మక్‌చంద్ర, బలగం ఫేమ్ లక్ష్మణ్ సంజయ్ , హరీష్ లు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.