Suriya 44 : తమిళ స్టార్ హీరో సూర్య తన 44వ సినిమా షూటింగ్ తేదీని ప్రకటించారు. క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూన్ నెలలో అండమాన్‌లోని పోర్ట్ బ్లెయిర్‌లో ప్రారంభం కానుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్ స్టార్ట్ అవుతుందని చిత్ర యూనిట్ వీడియో ద్వారా తెలియజేసింది. ఈ చిత్రానికి ‘సూర్య-44’ అనేది వర్కింగ్ టైటిల్ . ఇప్పటికే టెక్నీషియన్ల వివరాలను ప్రకటించిన చిత్ర యూనిట్, ఇప్పుడు షూటింగ్ షెడ్యూల్‌ను వెల్లడించింది. లవ్, లాఫ్టర్ , వార్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందని ముందు నుంచే చెబుతున్నారు.

‘సూర్య-44’లో భారీ క్యాస్టింగ్ ఉండనుంది. ప్రస్తుతం సూర్య దర్శకుడు శివ డైరెక్షన్‌లో ‘కంగువా’ అనే పీరియాడిక్ ఫిక్షన్ మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ, బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువా’ తర్వాత ‘సూర్య-44’ షూటింగ్‌లో పాల్గొంటాడు.

Leave a comment

error: Content is protected !!