Hitlist teaser : తమిళ దర్శకుడు విక్రమన్ తనయుడు విజయ్ కనిష్క హీరోగా ఎంట్రీ ఇస్తూ.. శరత్ కుమార్, గౌతం వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం హిట్ లిస్ట్. సూర్య కదిర్ కాకల్లార్, కార్తికేయ దర్శకత్వంలో ఆర్. కె. సెల్యులాయిడ్ పై కె. ఎస్. రవికుమార్ ఈ సినిమాను నిర్మించారు. మే 31న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. గతంలో ఈ సినిమా ఫస్ట్ పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. తమిళ వెర్సటైల్ హీరో సూర్య ఈ సినిమా టీజర్ ను లాంచ్ చేశారు.

యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ జానర్‌లలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ , ప్రీ రిలీజ్ ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మురళీ మోహన్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ హాజరయ్యారు. వీరితోపాటు నిర్మాత, దర్శకుడు కె. ఎస్. రవికుమార్ గారు, హీరో విజయ్ కనిష్క, దర్శకులు సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్, తెలుగు రిలీజ్ నిర్మాతలు శ్రీనివాస్ గౌడ్, బెక్కం రవీంద్ర పాల్గొన్నారు.

 

 

Leave a comment

error: Content is protected !!