Kollywood : త్వరలో కోలీవుడ్ నుంచి రాబోయే భారీ చిత్రాల్లో .. రజినీకాంత్ హీరోగా అమితాబ్, రానా లాంటి స్టార్స్ కలయికలో దర్శకుడు టిజి జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న “వేట్టైయన్” ఒకటి . ‘జైలర్’ లాంటి సూపర్ హిట్ తర్వాత రజిని నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్.

అయితే .. అదే డేట్ లో స్టార్ హీరో సూర్య నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం “కంగువ” కూడా రిలీజ్ కానుంది. కోలీవుడ్ లో ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ఇది. శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో జానపద జానర్ లో అందరినీ అబ్బుర పరచడానికి రెడీ అవుతోంది.

ఒకే డేట్ లో ఈ రెండు సినిమాలు పడితే భారీ క్లాష్ తప్పదని చెప్పాలి. ప్రస్తుతం అయితే కోలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. కంగువ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు. రెండు సినిమాలపై కూడా ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ రెండింట్లో ఏ సినిమాది పై చేయి అవుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!