Quotation Gang : వెండితెరపై తన అందంతో, గ్లామరస్ పాత్రలతో కుర్రకారుల్ని ఊర్రూతలూగిస్తున్న సన్నీలియోన్ ఇప్పుడు మరో విభిన్నమైన పాత్రలో కనిపించబోతోంది. ప్రముఖ నటి ప్రియమణితో కలిసి నటిస్తున్న తమిళ చిత్రం “కొటేషన్ గ్యాంగ్”. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. వివేక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సన్నీ, ప్రియమణి మునుపెన్నడూ చూడని విధంగా రా అండ్‌ రస్టిక్‌ లుక్‌లో కనిపించి, యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

ఈ సందర్భంగా సన్నీలియోన్ మాట్లాడుతూ, “చాలా మంది దర్శకనిర్మాతలు గొప్ప కథలతో నా దగ్గరికి వస్తుంటారు. ‘ఈ పాత్ర మీ ఇమేజ్‌ని మారుస్తుంది’ అంటూ చెప్పినవాళ్లూ ఎక్కువే. ఇది విన్న ప్రతిసారి నేను చాలా సంతోషిస్తుంటాను. ఎందుకంటే వారు తమ సినిమాని, కథను నమ్ముతున్నారు. కానీ.. ఎంతో ప్రత్యేకంగా నా కోసమే ఈ పాత్రను, కథను సృష్టించినందుకు ధన్యవాదాలు” అని చెప్పుకొచ్చింది. జాకీ ష్రాఫ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం జులైలో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ తో సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. సన్నీలియోన్ కెరీర్‌లోనే ఇది ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుందని అభిమానులు భావిస్తున్నారు.

 

 

Leave a comment

error: Content is protected !!