బాలీవుడ్ శృంగార తార  సన్నీలియోన్ క్రేజ్ ఎలాంటిదో చెప్పనవసరం లేదు. ఒక పక్క సినిమాల్లో నూ , మరో పక్క వెబ్ సీరిస్ లోనూ తీరికలేకుండా నటిస్తూ సత్తా చాటుకుంటోన్న అమ్మడు . ఇప్పుడు నిర్మాణ రంగంలోకి కూడా  అడుగుపెడుతోంది.  బాలీవుడ్ లో ఆల్రెడీ చాలా మంది తారలు నిర్మాతలుగా మారిన సంగతి తెలిసిందే. ఆ లిస్ట్ లోకి ఇప్పుడు సన్నీ కూడా చేరిపోయింది.

తాను  నిర్మించే సినిమాల నిర్మాణాన్ని సన్నీ భర్త డేనియల్ వెబర్ చూసుకుంటాడట.  కథ మన ఆధీనంలో ఉంటే.. మనం ఎవరినీ నిందించాల్సిన అవసరమే ఉండదని,  ఈ ఏడాదే తమ సినిమా నిర్మాణం జరుపుకోనుందని అంటోంది ఈ సుందరి. అలాగే నిర్మాతగా మారడం తనకు చాలా సంతోషాన్నిస్తోందని, నిర్మించబోయే తొలి చిత్రం తనకు చాలా ఉత్సాహాన్నిస్తోందని చెబుతోంది. ఇంకా ఈ సినిమాలో ఎలాంటి సందేశాలూ ఉండవని, తన సినిమా సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుందని నొక్కి వక్కాణించింది. మరి సన్నీలియోన్ నిర్మాతగా ఏ రేంజ్ లో లాభాలు ఆర్జిస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!