చూపు తిప్పుకోలేని అందం. గ్లామర్ కు అసలు సిసలు పర్యాయపదం ఆమె. అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రెస్ . శృంగార సామ్రాజ్యానికి ఆమె మకుటం లేని మహారాణి. ఆమె పేరు సన్నీలియోన్. ఇప్పుడు  ఈ ఒక్క పేరు చాలు బాక్సాఫీస్ షేక్ అయిపోవ‌డానికి. సినిమా ఎలా ఉంద‌నే మాట‌తో వాళ్ల‌కు ప‌నిలేదు.. స‌న్నీ సినిమా అంటే ఎలా ఉన్నా కూడా నిర్మాత‌ల‌కు వ‌ర్క‌వుట్ అవుతుందంతే. అదే ఆమెలో ఉన్న ప్ర‌త్యేక‌త‌. స‌న్నీ కోస‌మే సినిమాకు వెళ్లే ఆడియ‌న్స్ ల‌క్ష‌ల్లో ఉంటారు. అందుకే ఎన్ని ఫ్లాపులు వ‌చ్చినా కూడా స‌న్నీలియోన్ క్రేజ్ మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఇక ఈమెను తెలుగు ఇండ‌స్ట్రీకి తీసుకురావ‌డానికి.. ఇక్క‌డ ఆమెతో సినిమాలు చేయ‌డానికి మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా బాగానే ప్ర‌య‌త్నిస్తున్నారు. అలా ప్ర‌య‌త్నించిన ప్ర‌తీసారి నిర్మాతల బ్యాంక్ బ్యాలెన్స్ అలా క‌రిగిపోతుంది. ‘క‌రెంట్ తీగ’ సినిమాలో 15 నిమిషాలు క‌నిపించినందుకే 75 ల‌క్ష‌లు స‌మ‌ర్పించుకున్నారు. ఇక ఆ త‌ర్వాత ‘గ‌రుడ‌వేగ‌’లో ఓ పాట చేయ‌డానికి కూడా బాగానే తీసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడు వీరమహాదేవి సినిమాలో కూడా నటిస్తుంది సన్నీలియోన్.

శృంగార తారగా కెరీర్‌ ప్రారంభించి అనంతరం బాలీవుడ్‌ కథానాయికగా కెరీర్‌ టర్న్‌ తీసుకోని తన అందచందాలతో భారతీయ సినీప్రియుల మదిని దోచింది సన్నీలియోని. ఉర్రూతలూగించే ప్రత్యేక గీతాలతో అలరిస్తునే నటనా ప్రాధాన్యమున్న చిత్రాలతోనూ అందరి దృష్టిని ఆకర్షించింది సన్నీ. ఇటీవల కాలంలో దక్షిణాది భాషా చిత్రాల్లోనూ మెరిపిస్తూ ఇక్కడి వారికీ దగ్గరయింది. ఓవైపు వెండితెరపై వేడివేడి అందాలతో సెగలు పుట్టిస్తూనే.. సామాజిక మాధ్యమాల వేదికగానూ కుర్రకారు మదిలో కాక పుట్టిస్తుంటుంది సన్నీ. ఆమె జీవిత కథతో బాలీవుడ్ లో ఒక వెబ్ సిరీస్ కూడా తెరకెక్కింది. నేడు సన్నిలియోన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ గ్లామర్ క్వీన్ కు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే సన్నిలియోన్ ..

 

Leave a comment

error: Content is protected !!