Shopping Cart 0 items - $0.00 0

న్యూలుక్ : సునీల్ శెట్టి ‘మోసగాళ్ళు’

మంచు విష్ణు , కాజల్ జంటగా.. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ చిన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఇంటెన్స్ థ్రిల్లర్ ‘మోసగాళ్ళు’. దేశంలో జరిగిన అతి పెద్ద ఐటి స్కామ్ నేపథ్యంలో  జరిగే కథతో  ఈ సినిమా ఈ వేసవిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్ని మొదలు పెట్టారు మేకర్స్ . మొన్నామధ్య ‘మోసగాళ్ళు’ చిత్రంలోని కాజల్ లుక్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్..  ఈ రోజు ఇందులో కుమార్ అనే పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోన్న బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి లుక్ ను విడుదల చేశారు.

కొద్ది నిమిషాల క్రితం విడుదలైన ఈ లుక్ అంతటా  ఆసక్తి రేకెత్తిస్తోంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ బ్యానర్స్ పై వెరోనికా మంచు  నిర్మిస్తోన్న ఈ సినిమా తో మంచు విష్ణు బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!