Sundarakanda teaser : టాలీవుడ్‌ యువ హీరో నారా రోహిత్ తన కెరీర్‌లో మరో కొత్త ప్రయత్నం చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే కంటెంట్‌ ఆధారిత చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన రోహిత్ ఈ సారి ‘సుందరకాండ’ అనే కామెడీ ఎంటర్‌టైనర్‌తో వస్తున్నాడు. ఈ చిత్రం యొక్క టీజర్‌ను తాజాగా విడుదల చేశారు మేకర్స్ . దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

శ్రీదేవి విజయ్ కుమార్, వ్రితి వఘాని, నరేష్, వాసుకి ఆనంద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను వెంకటేష్ నిమ్మలపూడి డైరెక్ట్ చేస్తుండగా.. సంతోష్ చిన్నపోల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

టీజర్‌లో నారా రోహిత్, తన పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలో ఉండవలసిన ఐదు లక్షణాల గురించి చెబుతున్నాడు. అతడి ఆలోచనలకు తగిన అమ్మాయిని కనుగొనడంలో కలిగే ఇబ్బందులు, ఫ్యామిలీ మెంబర్స్ ఆందోళన వంటివి టీజర్‌లో చూపించారు. రోహిత్ అనుకున్న ఐదు లక్షణాలు కలిగిన అమ్మాయి అతడికి దొరుకుతుందా లేదా అనేది సినిమాలో కీలక ప్రశ్న. నారా రోహిత్ కొత్త అవతారంలో కనిపించబోతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!