ఆకర్షించే ముఖం మీద చిరునవ్వు అతికించుకొని …  ఆకట్టుకునే అభినయంతో అలరించడం అతడి స్టైల్.  జయాపజయాలతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు యూత్ ఫుల్ మూవీస్ తో టాలీవుడ్ కుర్రకారును మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతడి పేరు సుమంత్ అశ్విన్ .

ప్రముఖ నిర్మాత ఎమ్‌.ఎస్‌.రాజు తనయుడైన సుమంత్‌ అశ్విన్‌..  కథానాయకుడు కాకముందు తండ్రితో కలిసి సొంత నిర్మాణ సంస్థలో పనిచేశాడు. 2012లో తండ్రి ఎమ్‌.ఎస్‌.రాజు దర్శకత్వంలోనే ‘తూనీగ తూనీగ’ చిత్రంతో  కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత  ‘అంతకుముందు ఆ తరువాత’ చిత్రంతో అతడికి  మంచి పేరొచ్చింది. ‘లవర్స్‌’తో వాణిజ్య విజయాన్ని అందుకొన్న సుమంత్‌ అశ్విన్‌ ‘కేరింత’తో నటుడిగా అలరించాడు. ‘చక్కిలిగింత’, ‘రైట్‌ రైట్‌’, ‘ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌’ చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయాయి. నిహారిక కొణిదెలతో కలిసి ‘హ్యాపీవెడ్డింగ్‌’ చిత్రంలో సందడి చేశాడు. ‘ఎందుకిలా’ అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించిన సుమంత్‌ అశ్విన్‌ ‘ప్రేమకథా చిత్రం2’తో కథానాయకుడిగా మురిపించాడు.  ప్రస్తుతం ఇదే మా కథ లో నటిస్తున్నాడు. నేడు సుమంత్ అశ్విన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే సుమంత్ అశ్విన్

 

Leave a comment

error: Content is protected !!