కరోనా  లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలు తప్ప మిగతా పరిశ్రమల్ని స్థంభించిపోయాయి. దీంతో షూటింగ్స్ లేక హీరోలు ఇంటిపట్టునే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. కొంత మంది ఇంట్లో రకరకాల గేమ్స్ ఆడుతున్నారు. కొందరు బొమ్మలు గీసుకుంటున్నారు. కొందరు ఇష్టమైన సినిమాలు చూస్తున్నారు. మరికొందరు వంటలు చేస్తూ క్వారంటైన్ టైమ్ ను సద్వినియోగం చేసుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఇంటి పనుల్లో తమ తమ భార్యలకు సాయం చేస్తూ.. బి ది రియల్ మేన్ ఛాలెంజ్ లు విసురుతున్నారు . అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నుంచి రాజమౌళికి చేరిన ఈ ఛాలెంజ్ .. ఇప్పుడు పులువురు సినీ సెలబ్రిటీస్ కు చేరింది. అందులో సుకుమార్ ఒకడు .

 ‘బి ది రియల్ మెన్’ ఛాలెంజ్ ను స్వీకరించి ఇల్లు ఊడ్వడంతో పాటు ఇంట్లో బాసాన్లు కడిగి తన భార్యకు సహాయం చేసాడు సుక్కూ.  అంతేకాదు సుకుమార్.. నిర్మాత దిల్ రాజు, దర్శకులు సురేందర్ రెడ్డి, కొరటాల శివతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‌కు ఈ  ఛాలెంజ్ స్వకరించమని ఛాలెంజ్ విసిరాడు. మొత్తానికి లాక్‌డౌన్‌లో ఇంట్లో ఉన్న సెలబ్రిటీలు ఇపుడు ఇంట్లో పనులు చేస్తూ.. అభిమానులతో ప్రజలకు కూడా ఇంట్లో ఆడవాళ్లకు సాయం చేయమని మంచి సందేశం ఇస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!