Sujith : పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘ఒ.జి’. చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరుకుంది. భజే వాయువేగం ప్రమోషనల్ ఈవెంట్ లో ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను దర్శకుడు సుజీత్ పంచుకున్నాడు.

పవన్ కళ్యాణ్ సినిమాల్లో జపనీస్ సినిమాల ప్రభావం చాలా ఉంటుందని, పాటలు, సన్నివేశాల్లో కనిపిస్తుందని సుజీత్ చెప్పారు. అవకాశం వస్తే పవన్ కళ్యాణ్‌ని ఆ నేపథ్యంలో చూపించాలనుకున్నానని, ‘ఒ.జి’తో అది నెరవేరిందని తెలిపారు. “ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్” అనే మాట నుంచే ‘ఒ.జి’ అనే పేరు పుట్టిందని, కానీ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు ఓజాస్ గంభీర, గంభీర ఆయన పేరు, ఓజాస్ అనేది మాస్టర్ పేరు అని, ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సుజీత్ వివరించాడు.

మొదట తనను రీమేక్ సినిమా కోసం పిలిచినట్టు సుజీత్ చెప్పాడు. కానీ పవన్ కళ్యాణ్‌తో ఒరిజినల్ కథ చేయడంలో ఉన్న అనుభూతి, కిక్ వేరు అని, ఒక రోజు ‘కొత్త కథ ఏదైనా ఉందా?’ అని పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు ఒక్క లైన్ చెప్పగానే ఆయన చేయడానికి అంగీకారం తెలిపారని చెప్పాడు. ‘ఒ.జి’లో పవన్ కళ్యాణ్‌ సరసన ప్రియాంక మోహన్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం 2024లో విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!