Suhaas :  టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ ఎర్లియర్ మూవీ ప్రసన్నవదనం. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో.. తన తదుపరి చిత్రంపై మరింతగా దృష్టి పెడుతున్నాడు. తన సినిమాలకు ఎంతో ఇన్నోవేటివ్ గా టైటిల్స్ నిర్ణయించే ఈ హీరో .. నెక్స్ట్ మూవీకి కూడా వెరైటీ టైటిల్ ఫిక్స్ చేశాడు. ఆ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు.

దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డిలు నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘జనక అయితే గనక’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సందీప్ రెడ్డి బండ్ల దీనికి దర్శకుడు. ఈ మేరకు టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను వదిలారు మేకర్స్. ఈ పోస్టర్‌లో సుహాస్ తల పట్టుకుని కనిపిస్తున్నాడు.

“ఆనందం – పట్టలేనంత.. బాధలు – చెప్పుకోలేనంత.. నవ్వులు ఆపుకోలేనంత..” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో సంగీర్తన విపిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, విజయ్ బుల్గనిన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను జూలై 4న విడుదల చేస్తున్నట్లు ఆ పోస్టర్ పైనే ప్రకటించారు. ఈ ప్రకటనతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది.

Leave a comment

error: Content is protected !!