Sudheerbabu : యువ హీరో సుధీర్ బాబు తన కెరీర్‌లో విభిన్న పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. తన ప్రతి సినిమాతో కొత్త ప్రయత్నం చేస్తూ వస్తున్న సుధీర్ బాబు, తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా సుధీర్ బాబు నటిస్తోన్న ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమాపై ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది.

ఈ సినిమాను ‘లూజర్’ వెబ్ సిరీస్ దర్శకుడు అభిలాష్ కంకర తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు. రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు. జై కృష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వి సెల్యులాయిడ్, కామ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుధీర్ బాబు కొత్త ఇమేజ్‌లో కనిపించనున్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Leave a comment

error: Content is protected !!