Sudheerbabu : నైట్రో స్టార్ సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ ‘మా నాన్న సూపర్‌హీరో’. ఈ చిత్రం తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించనుంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రం తండ్రీ కొడుకుల మధ్య ప్రేమ, అనుబంధాలు, కుటుంబ బంధాల గురించి చూపిస్తూ ప్రేక్షకుల మనసుల్ని కదిలించే ప్రయత్నం చేయనుంది. తండ్రి తన కొడుకు కోసం ఏమి చేయగలడనే విషయాన్ని కథ ఆధారంగా చేసుకుని ఈ చిత్రం రూపొందించబడింది.

ఈ చిత్రం సీఏఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి వి. సెల్యులాయిడ్స్ పతాకంపై నిర్మించబడింది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్ గా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేశారు మేకర్స్ . ఈ పోస్టర్ లో సుధీర్ బాబు తన కొడుకుతో కలిసి ఉన్న లుక్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Leave a comment

error: Content is protected !!