Sudheerbabu : నైట్రో స్టార్ సుధీర్ బాబు ఇటీవల “హరోం హర” సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ హీరో .. తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాడు . ఈసారి ఒక పాన్ ఇండియా సూపర్ నేచురల్ థ్రిల్లర్‌లో నటించబోతున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు ప్రేరణ అరోరా, శివిన్ నారాయణ్, నిఖిల్ నందా, ఉజ్వల్ ఆనంద్ కలిసి నిర్మించనున్నారు. వీరు బాలీవుడ్‌లో “రుస్తుం”, “టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ”, “ప్యాడ్ మ్యాన్” వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.

ఈ చిత్రానికి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహించనున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమయ్యే ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలుస్తోంది. సుధీర్ బాబు సరసన ఒక బాలీవుడ్ నటి నటించనున్నట్లు సమాచారం. చిత్రానికి సంబంధించిన మరింత వివరాలను త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది.

Leave a comment

error: Content is protected !!