Sudheer babu : హరోం హర మూవీ సుధీర్ బాబు కెరీర్లో మోస్ట్ అవేటెడ్ సినిమా. జ్ఞానసాగర్ ద్వారక డైరెక్ట్ చేసిన ఈ సినిమా  ప్రమోషన్లు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఇన్నోెవేటివ్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరెక్కించాడు దర్శకుడు. గతేడాది హంట్, మామా మశ్చీంద్రా సినిమాలతో వచ్చినా.. అతడు పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాడు. ఇప్పుడు తన ఆశలన్నీ హరోం హర సినిమాపైనే పెట్టుకున్నాడు.

హరోం హర మూవీ మే 31న రిలీజ్ కావాల్సి ఉన్నా.. మేకర్స్ వాయిదా వేశారు. అదే రోజు మరో ఐదు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉన్నాయి. దీంతో ఈ సినిమాను జూన్ 14వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజు ఈ సినిమా  సోలోగా రిలీజ్ కానుంది. ఇది కచ్చితంగా ఆ సినిమా కలెక్షన్లపై సానుకూల ప్రభావం చూపనుంది. కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న సుధీర్ బాబుకి హరోం హర సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ తెచ్చిపెడుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!