Ek tha Tiger @ 12 : యశ్‌రాజ్‌ ఫిలింస్‌ స్పై యూనివర్స్‌కు నాంది పలికిన ‘ఏక్ థా టైగర్‌’ సినిమా విడుదలై 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు కబీర్ ఖాన్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా నిర్మాణ సమయంలోని కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

కబీర్ ఖాన్‌ మాట్లాడుతూ, “వైఆర్‌ఎఫ్‌ నిర్మాణ సంస్థలో ఇది మొదటి యాక్షన్‌ చిత్రం కావడంతో దీన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా సల్మాన్ ఖాన్‌ చేసే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యపర్చాలని అనుకున్నాం. దీని కోసం బాలీవుడ్‌ యాక్షన్ డైరెక్టర్లతో పాటు, 14 దేశాల నుంచి నైపుణ్యం కలిగిన స్టంట్ మాస్టర్లను రంగంలోకి దించాల్సి వచ్చింది” అని తెలిపారు.

‘ఏక్ థా టైగర్‌’ సినిమాలో సల్మాన్ ఖాన్‌ పోషించిన టైగర్‌ పాత్రకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. టైగర్‌ అండ్ జోయా మధ్య ప్రేమ కథ, టైగర్‌ చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా భారీ వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

 

Leave a comment

error: Content is protected !!