Sthree 3 : బాలీవుడ్ లో హారర్ కామెడీ జానర్‌కు ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన సినిమాల్లో ‘స్త్రీ’ ఒకటి. రాజ్‌-డీకే ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో, అంతే తీవ్రంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పట్లో ఈ సినిమా సాధించిన విజయం మామూలుది కాదు. అలాగే.. దానికి వచ్చిన సీక్వెల్ మరింత పెద్ద సంచలనాన్ని సృష్టించి, భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయే రికార్డును నెలకొల్పింది.

‘స్త్రీ 2’ సినిమా కథ నూతనంగా ఏమీ లేకపోయినప్పటికీ, అందులోని థ్రిల్, ఎంటర్టైన్మెంట్ అంశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద సినిమా విడుదలైన సమయం కూడా దాని విజయానికి దోహదపడింది. ఫలితంగా, ఈ సినిమా రూ. 700 కోట్లకు పైగా వసూలు చేసి, ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా విజయంతో నటి శ్రద్ధా కపూర్ కెరీర్‌లో మరో మైలురాయి సాధించింది.

‘స్త్రీ 2’ సినిమా విజయం తర్వాత, ప్రేక్షకులు ‘స్త్రీ 3’ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మేకర్స్ కూడా ఈ అంచనాలను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ‘స్త్రీ 3’ స్క్రిప్టు వర్క్, ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమైయ్యాయి. నటి శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో తన పాత్ర చాలా బాగుంటుందని, మూడో భాగంలో ఎంటర్టైన్మెంట్ పీక్స్‌లో ఉంటుందని హామీ ఇచ్చింది. ‘స్త్రీ’ సిరీస్ హారర్ కామెడీ జానర్‌కు ఒక కొత్త మార్గదర్శిగా నిలిచింది. ఈ సినిమాలు ప్రేక్షకులకు భయం, నవ్వు రెండింటినీ ఒకేసారి అనుభవించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ సిరీస్ విజయం, ఇతర చిత్ర నిర్మాతలను కూడా ఈ జానర్‌పై దృష్టి సారించేలా చేసింది.

Leave a comment

error: Content is protected !!