భారతీయ మార్కెట్‌లో యానిమేషన్ చిత్రాలకు మంచి భవిష్యత్తు ఉందని భావిస్తున్నారు టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఆయన అతిపెద్ద హిట్ “బాహుబలి 2” కూడా భారత జనాభాలో కేవలం 10% మందికే చేరిందని ఆయన అభిప్రాయ పడ్డారు.

“భారతదేశంలో సినిమాలకు చాలా పెద్ద మార్కెట్ ఉంది. దానిని వినియోగించుకోవాలంటే, ట్రెడిషనల్ స్టోరీ మేకింగ్ కు మించి ఆలోచించాలి. అలాంటి ఓ దశే యానిమేషన్ చిత్రాలు అని నేను నమ్ముతున్నాను. భవిష్యత్తులో ఖచ్చితంగా నేను యానిమేషన్ చిత్రానికి దర్శకత్వం వహిస్తాను” అని ఆయన చెప్పారు.

“బాహుబలి” ఆధారంగా రూపొందిన యానిమేషన్ చిత్రం “బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ ప్రమోషన్ ఈవెంట్‌లో ఆయన ఈ విషయాలు మాట్లాడారు. రాబోయే రోజుల్లో బాహుబలి కథ వివిధ రూపాల్లో, వేదికలపై ప్రజలకు చేరుతుందని రాజమౌళి తెలిపారు. ఈ యానిమేషన్ చిత్ర నిర్మాణంలో ఈ టీమ్‌తో కలిసి చాలా నేర్చుకున్నానని, భవిష్యత్తులో ఈ జ్ఞానం ఉపయోగపడుతుందని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మహేశ్ బాబు తో తీయబోయే సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు రాజమౌళి.

 

Leave a comment

error: Content is protected !!