Srisrisri Rajavaru teaser : యువ నటుడు నార్నే నితిన్, ప్రతిభావంతుడైన దర్శకుడు సతీష్ వేగేశ్న, నిర్మాత చింతపల్లి రామారావు కలయికలో తెరకెక్కుతోన్న వెరైటీ లవ్ స్టోరీ శ్రీశ్రీశ్రీ రాజావారు. సంపద హీరోయిన్ గా నటిస్తోంది. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైన నాటి నుంచి అందరిలోనూ ఆసక్తిమొదలైంది.

“శతమానంభవతి” వంటి సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న ప్రతిభావంతుడైన దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. “గుర్తుందా శీతాకాలం” వంటి సినిమాలను నిర్మించిన చింతపల్లి రామారావు ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది.

“మ్యాడ్”, “ఆయ్” సినిమాల తర్వాత నార్నే నితిన్‌కు ఈ చిత్రం హ్యాట్రిక్ హిట్‌గా నిలిచే సినిమా కాబోతోంది. “శతమానం భవతి” తర్వాత సతీష్ వేగేశ్న మరో మాస్టర్‌పీస్‌ను ఈ సినిమాతోనే అందించడానికి రెడీ అవుతున్నారు. ఇంక ఈ సినిమా ట్రైలర్ ను క్రేజీ డైరెక్టర్ వంశీ పైడిపల్లి లాంచ్ చేశారు. ఈ సందర్బంగా చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు తెలియచేశారు.

Leave a comment

error: Content is protected !!