Srisrisri Rajavaru : “శ్రీ శ్రీ శ్రీ రాజావారు” అనే యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత చింతపల్లి రామారావు , శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్ లో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో.. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంపద హీరోయిన్లుగా నిర్మించారు. ఈ సినిమా పూర్తిగా కమర్షియల్ అంశాలతో రూపొందింది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ ఎ సర్టిఫికెట్ పొంది, సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ “జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ నటించిన ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయి. అలాగే మా దర్శకుడు సతీష్ వేగేశ్న మంచి టేస్ట్ ఉన్న దర్శకుడిగా పేరుగాంచారు. ఆయన ఈ సినిమాను తెరకెక్కించిన తీరు అందరినీ ఖచ్చితంగా ఖుషీ చేయిస్తుంది. ఇటీవలే మా సినిమాను సెన్సార్ సభ్యులు కూడా ప్రశంసించారు. యు/ఏ సర్టిఫికెట్ అందుకోవడం మాకు సంతోషంగా ఉంది. త్వరలోనే పూర్తి వాతావరణంతో మా చిత్రాన్ని విడుదల చేస్తాము” అని తెలిపారు.

Leave a comment

error: Content is protected !!