Hit 3 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నాని, ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ వంటి సినిమాలతో వరుస హిట్లు కొట్టి ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఈ జోష్‌తోనే శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హిట్ 3’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమాలో నాయికగా ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ విశాఖపట్నంలో జరుగుతుండగా, నాని, శ్రీనిధిపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ ఈ నెల రెండవ వారం వరకు కొనసాగుతుందని సమాచారం.
‘హిట్ 3’ ఒక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది.
ఈ సినిమాలో నానీ అర్జున్ సర్కార్ అనే శక్తిమంతమైన పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా 2024 మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సాను జాన్ వర్గీస్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.