Srileela : హీరో నితిన్ నటించిన “రాబిన్‌హుడ్” చిత్రం నుంచి శుక్రవారం ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. నటి శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆమె ఫస్ట్‌లుక్, గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ ప్రచార చిత్రంలో శ్రీలీల స్టైలిష్ లుక్‌లో తన ప్రైవేట్ జెట్ నుంచి దిగుతూ కనిపించింది. “జ్యోతీ.. సునామీలో టి సైలెంట్‌గా ఉండాలి. నా ముందు నువ్వు సైలెంట్‌గా ఉండాలి” అంటూ ఆమె చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. చిత్రంలో శ్రీలీల ‘లేడీ బాస్’ నీరా వాసుదేవ్ పాత్రలో నటించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

జీవీ ప్రకాశ్‌ కుమార్ సంగీతం, సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 20న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నితిన్‌కు జోడీగా శ్రీలీల నటిస్తుండగా, ఇతర ముఖ్య పాత్రల్లో అనన్య పాండే, సుహాస్, డేవిడ్ బ్లాజ్‌ తదితరులు నటిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!