Srikanth Odela : ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ వంటి సినిమాలతో వరుస హిట్లు కొట్టిన నేచురల్ స్టార్ నాని, ప్రస్తుతం రెండు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ‘హిట్’ ఫ్రాంఛైజీలో భాగంగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో హీరోయిజం, మాస్ ఎలిమెంట్స్‌ను కూడా జోడించే ప్రయత్నం చేస్తున్నాడు.

‘దసరా’తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన శ్రీకాంత్ ఓదెల, ఈ సినిమాలో కూడా మరోసారి రా మాస్ ఎంటర్టైనర్‌ను అందించేందుకు సిద్ధమవుతున్నాడు. రాయలసీమ ప్రాంతంలోని ఒక అరుదైన తెగకు సంబంధించిన నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది. నాని ఈ సినిమాలో మరింత వయొలెంట్‌గా, మాస్‌గా కనిపించనున్నాడు.

రెండు సినిమాలూ అధిక బడ్జెట్‌తో నిర్మితమవుతున్నాయి. నాని ఈ రెండు సినిమాల్లోనూ భిన్నమైన పాత్రలలో కనిపించనున్నాడు. శ్రీకాంత్ ఓదెల నానీతో రెండో సినిమా కోసం దాదాపు ఏడాదిన్నర పాటు స్క్రిప్ట్‌పై పని చేశాడు. దసరా తరహాలోనే రా అండ్ రస్టిక్ కేరక్టరైజేషన్ తో మళ్లీ నానీని మాస్ హీరోగా ఎలివేట్ చేసేందుకు రంగంలోకి దిగుతున్నాడు శ్రీకాంత్ ఓదెల.

Leave a comment

error: Content is protected !!